మాజీ ప్రధానికి సమన్లు | Former PM Manmohan Singh summoned as accused by a special court in a coal scam case | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధానికి సమన్లు

Published Wed, Mar 11 2015 10:48 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM

మాజీ ప్రధానికి సమన్లు

మాజీ ప్రధానికి సమన్లు

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మెడకు చుట్టుకుంటోంది.  ఈ కేసు విచారణకు హాజరుకావాలని ఢిల్లీ పటియాల హౌజ్‌ ప్రత్యేక  కోర్టు మన్మోహన్‌ సింగ్‌కు  సమన్లు జారీ చేసింది.  ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేర్చుతూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్‌ 8న విచారణకు హాజరుకావాలని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.  

బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానిని ఎందుకు ప్రశ్నించలేదని గతంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో  మన్మోహన్‌ సింగ్‌ను  సీబీఐ ఇంతకు ముందే ప్రశ్నించింది.  ఈ క్రమంలో మన్మోహన్ సింగ్‌కు కోర్టు సమన్లు జారీ చేయడం  ప్రాధాన్యత సంతరించుకుంది.  మన్మోహన్‌ సింగ్‌ బొగ్గు శాఖను పర్యవేక్షిస్తున్న సమయంలో హిండాల్కో సంస్థకు  అక్రమంగా గనులు కేటాయించారని ఆరోపణలున్నాయి.  ఈ కేటాయింపులకు సంబంధించి బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమారమంగళం బిర్లా, బొగ్గు శాఖ మాజీ  కార్యదర్శి  పరేఖ్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement