మహారాష్ట్రలో బాలికపై సామూహిక అత్యాచారం, హత్య
ముంబై : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఓ 15 ఏళ్ల బాలికను ముగ్గురు మృగాళ్లు సామూహిక అత్యాచారం చేసి, చేతులు విరిచి, ఆమె శరీరం మొత్తం గాయాలు చేసి గొంతు నులిమి చంపేశారు. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు విషయం వెలుగుచూడటం తీవ్ర చర్చనీయాంశమైంది. హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
పోలీసులు ప్రధాన నిందితుడు జితేంద్ర షిండే అలియాస్ ‘పప్పు’ను ఘటన జరిగిన మరుసటి రోజున, నేరంలో సహాయపడిన సంతోష్ భవ్, నితిన్ ధైల్యూమ్‌లను తర్వాత అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త బైక్ కొన్న జితేంద్ర షిండే జూలై 13న ఇద్దరు మిత్రులతో కలసి చెట్టుకింద మద్యం సేవిస్తున్నాడు. అదే సమయంలో బాలిక తన తాతను కలిసి తిరిగి వెళ్తోంది. ఆమెతో ముగ్గురు నిందితులు మాటలు కలిపారు. తర్వాత అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపారు. స్థానికులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మరణించింది. జితేంద్ర ఇటుకల బట్టీలో పనిచేసేవాడనీ, ఆమె వెంటపడి వేధించే వాడని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ రూ.3 లక్షల చెక్కును ఎక్స్‌గ్రేషియాగా బాలిక కుటుంబానికి ఇచ్చారు.
చేతులు విరిచి..గొంతు నులిమి..
Published Mon, Jul 18 2016 2:16 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
Advertisement