ఆడపిల్ల అంటే షటిల్ కాక్ కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: ఆడపిల్ల అంటే చరాస్తి కాదని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. నాలుగేళ్ల ఆడపిల్లను షటిల్ కాక్ వలె పరిగణిస్తూ ఆమెను తన తల్లిదండ్రుల సంరక్షణకు వంతులవారీగా అప్పగిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగేళ్ల ఆడపిల్ల త ండ్రి సంరక్షణలో4 రోజులు, తల్లి సంరక్షణ 3 రోజులు ఉండాలన్న హైకోర్టు తీర్పు సమంజసంగా లేదని, హైకోర్టు తీరు బాధాకరమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పసివయసులోని చిన్నారిని ఇలా వేదనకు గురిచేయడం సబబుకాదని పేర్కొంది. హైకోర్టు చేసిన ఈ ఏర్పాటు తమకేమాత్రం సంతృప్తికరం కాదని, దీన్ని సవరించాలని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్‌ఎప్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తననుంచి విడిపోయిన భర్త తన కుమార్తెను లాక్కుపోయాడని, కుమార్తెను తన సంరక్షణకే అప్పగించాలని కోరిన ఒక మహిళ కేసులో హైకోర్టు ఈ వంతులవారీ సంర క్షణకు ఏర్పాటు చేయగా, ఈ ఏర్పాటును సుప్రీం ఆక్షేపించింది.