నిర్భయ తరహాలో.. మరో గ్యాంగ్‌రేప్ | girl was allegedly gang-raped by four men in a moving car | Sakshi
Sakshi News home page

నిర్భయ తరహాలో.. మరో గ్యాంగ్‌రేప్

Published Mon, Nov 16 2015 12:29 PM | Last Updated on Sun, Sep 3 2017 12:34 PM

నిర్భయ తరహాలో.. మరో గ్యాంగ్‌రేప్

నిర్భయ తరహాలో.. మరో గ్యాంగ్‌రేప్

కాన్పూర్: నిర్భయ తరహాలోనే మరో దారుణం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కదులుతున్న కారులో ఓ బాలికపై నలుగురు వ్యక్తులు సోమవారం సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన చకేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మందులు కొనడానికి బయటకు వచ్చింది. అదే సమయంలో నలుగురు దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి కారులోనే గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం ఉన్నవో జిల్లాలోని బాంత్రా టోల్ ప్లాజా దగ్గర్లోని ముళ్ల పొదల్లోకి విసిరేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement