పెద్దనోట్ల రద్దు గోవాకు వచ్చే పర్యాటకులపై భారీగా ప్రభావం చూపుతోంది.
పణజి: పెద్దనోట్ల రద్దు గోవాకు వచ్చే పర్యాటకులపై భారీగా ప్రభావం చూపుతోంది. సాధారణంగా క్రిస్మస్ నుంచి జనవరి 1 వరకు దేశీ, విదేశీ పర్యాటకులతో గోవా బీచ్‌లు కోలాహలంగా కనిపించేవి. పెద్ద నోట్ల రద్దుతో కొత్త నోట్లకు తీవ్రకొరత ఏర్పడడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
దీని ప్రభావంతో గోవాలోని హోటళ్లు, అద్దెకు ఇచ్చే గుడిసెలు పర్యాటకులు లేక కళ తప్పాయని హోటళ్ల యజమానులు వాపోతున్నారు. గోవా పర్యాటక మంత్రి మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ నోట్లరద్దు వల్ల సమస్యే లేదనీ, పర్యాటకులు గోవా బీచ్‌లకు పోటెత్తుతారని అన్నారు.