ఫారిన్‌ పోదాం... పండగ చేద్దాం ఛలో.. ఛలో | tollywood actors went to holiday spot goa | Sakshi
Sakshi News home page

ఫారిన్‌ పోదాం... పండగ చేద్దాం ఛలో.. ఛలో

Published Sun, Jan 1 2017 1:06 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

ఫారిన్‌ పోదాం... పండగ చేద్దాం ఛలో.. ఛలో - Sakshi

ఫారిన్‌ పోదాం... పండగ చేద్దాం ఛలో.. ఛలో

‘గో.. గో... గోవా!’ అంటూ సముద్ర తీరానికి వెళ్లిన తెలుగు తారాతోరణం, న్యూ ఇయర్‌కి గోవాలో గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. ఫ్రెండ్స్‌తో గోవాలో ఎంజాయ్‌ చేస్తోన్న బ్యాచ్‌ కొందరైతే... ప్రైవసీ కోరుకునే వాళ్లంతా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో ఫారిన్‌కి వెళ్లారు. ఆల్రెడీ మహేశ్‌బాబు, రామ్‌చరణ్‌లు ఫారిన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కమల్‌హాసన్‌ కూతురు శ్రుతీహాసన్‌ సైతం విదేశాల్లో న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ చెప్పారు. ఇక, 2016లో ‘పక్కా లోకల్‌’ ఐటమ్‌ సాంగ్‌తో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసిన కాజల్‌ అగర్వాల్‌ కూడా ఇప్పుడు లోకల్‌లో లేరు.

విదేశాల్లోనే 2017కి స్వాగతం చెప్పారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోయే ప్రియమణి కాబోయే భర్త ముస్తఫాతో కలసి మాల్దీవుల్లో మస్తుగా ఎంజాయ్‌ చేస్తున్నారు. న్యూ ఇయర్‌కి అక్కడే వెల్‌కమ్‌ చెప్పారు. రెండు రోజులుగా ‘ఖైదీ నంబర్‌ 150’లోని ‘రత్తాలు..’ ఐటమ్‌ సాంగ్‌తో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న రాయ్‌ లక్ష్మి సైతం న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కి ఫారిన్‌ వెళ్లారు. వీళ్లతో పాటు మరికొంత మంది స్టార్లు ఫారిన్‌ పోదాం.. పండగ చేద్దాం అంటూ విదేశాలకు వెళ్లారు. కొత్త సంవత్సరానికి హుషారుగా స్వాగతం చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement