న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను అనుసరించి ఏవేనీ రెండు రాష్ట్రాల మధ్య రూ.50 వేలకు మించి విలువ కలిగిన సరకులను రవాణా చేయాలంటే ఫిబ్రవరి 1 నుంచి ఎలక్ట్రానిక్ వే (ఈ–వే) బిల్లు తప్పనిసరని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఒకే రాష్ట్రంలో రవాణాకు ఈ–వే బిల్లులను ఎప్పుడు అమలుచేయాలనే విషయం రాష్ట్రాలకే వదిలేస్తున్నామనీ, ఫిబ్రవరి 1 నుంచి జూన్ 1 మధ్య వారు ఎప్పుడైనా ఈ–వే బిల్లులను తప్పనిసరి చేయొచ్చని ఆయన వెల్లడించారు. ఈ–వే బిల్లులు జారీ చేసేందుకు తగిన సాంకేతిక వ్యవస్థ సిద్ధం కాకపోవడంతో దీన్ని ఇన్నాళ్లూ వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment