
అహ్మదాబాద్: కరోనా వైరస్‌తో పోరాడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేటర్ బద్రుద్దీన్ షేక్ ఆదివారం కన్ను మూశారు. అతనికి కరోనా సోకడంతో ఎనిమిది రోజుల క్రితం అహ్మదాబాద్‌లోని ఎస్‌వీపీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఆయన మరణించారు. అతను పేద ప్రజలకు సహాయం చేసే క్రమంలో వైరస్ బారిన పడ్డాడరని గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు శక్తిసిన్హ గోహిల్ పేర్కొన్నారు. అతని మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొంటూ ట్విటర్ వేదికగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ స్థానిక అధికారులకు సహకరించాలని కోరారు. కాగా భారత్‌లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 26,917కు, మరణాల సంఖ్య 826కు చేరిందని ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. (ఒక్కరోజులో 1,975 కేసులు)