మాక్ డ్రిల్‌లో ‘ఉగ్రవాదులకు’ ముస్లిం టోపీలు! | Gujarat police nirvakam | Sakshi
Sakshi News home page

మాక్ డ్రిల్‌లో ‘ఉగ్రవాదులకు’ ముస్లిం టోపీలు!

Published Thu, Jan 1 2015 2:56 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు బుధవారం నిర్వహించిన ఉగ్రవాద నిరోధక మాక్ డ్రిల్ వివాదాస్పదమైంది.

  • గుజరాత్ పోలీసుల నిర్వాకం
  • సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు బుధవారం నిర్వహించిన ఉగ్రవాద నిరోధక మాక్ డ్రిల్ వివాదాస్పదమైంది. డ్రిల్‌లో భాగంగా ముగ్గురు యువకులను ఉగ్రవాదులుగా నటించమని కోరిన పోలీసులు ఇందుకోసం వారికి ముస్లిం టోపీలు ఇవ్వడంపై రాజకీయ దుమారం రేగింది. దీనిపై తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ...ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టింది. పోలీసుల చర్యను గుజరాత్ బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మెహబూబ్ అలీ సూఫీ బాబా కూడా తప్పుబట్టారు. అయితే పోలీసులు మాత్రం తమ చర్యను సమర్థించుకున్నారు. మాక్ డ్రిల్స్‌ను రకరకాల వేషధారణల్లో నిర్వహిస్తుంటామని...ఇందులో తప్పేమీ లేదన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement