బావిలో పడిన ట్రాక్టర్.. 10మంది మృతి | Gujarat: Tractor Falls Into Well In Mahisagar District; 10 Dead | Sakshi
Sakshi News home page

బావిలో పడిన ట్రాక్టర్.. 10మంది మృతి

Published Sun, Mar 13 2016 9:17 AM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM

Gujarat: Tractor Falls Into Well In Mahisagar District; 10 Dead

అహ్మదాబాద్: గుజరాత్లో దారుణం చోటుచేసుకుంది. ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు 20 అడుగుల లోతులో ఉన్న బావిలో పడటంతో అక్కడికక్కడ 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తమ స్వగ్రామానికి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు హాజరై వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

గుజరాత్లోని మహిసాగర్, పంచ్మహల్స్ జిల్లాలకు సరిహద్దులోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయాడు. అతడి అంత్యక్రియలకు కోసం స్మశాన వాటికకు మూడు ట్రాక్టర్లో ఆ గ్రామస్తులు వెళ్లొస్తున్నారు. అందులో చివరలో ఉన్న ఓ ట్రాక్టర్లో 35 మంది ఉన్నారు. అది అనుకోకుండా ప్రమాదవశాత్తు బావిలో పడిపోవడంతో పదిమంది ప్రాణాలుకోల్పోయారు. 24మంది గాయాలపాలయ్యారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement