
'న్యాయ నియామక' రగడ: ప్రక్రియకు సీజే దూరం
వివాదాస్పదంగా మారిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జేఈసీ) సభ్యుల ఎంపిక వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది, సోమవారం ఎన్జేఈసీకి ఇద్దరు సభ్యులను ఎన్నుకోవలసి ఉండగా ఆ ప్రక్రియకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తూ గైర్హాజరయ్యారు. దీంతో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. దాదాపు 15 నిమిషాలపాటు ఉత్తర్వుల జారీని నిలిపేశారు.
ఈ వ్యవహారంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవడం తగదని సీజే దత్తూ మీడియాతో అన్నారు. న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయ నియామకాల కమిషన్ పై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే ఇవేవీ పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఎన్జేఈసీ చట్టాన్ని కూడా రూపొందించింది. ఏప్రిల్ 21 నుంచి చట్టాన్ని అమలులోకి తెచ్చింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) రాజ్యాంగ చెల్లుబాటుపై వివాదం పరిష్కారమయ్యే వరకూ.. ఉన్నత న్యాయవ్యవస్థలో ఎటువంటి నియామకాలూ చేపట్టబోదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే.