
నేను చాలా మంచి అన్నయ్యను. చెల్లెలి కోసం పెద్ద త్యాగం చేశాను.
కాన్పూర్: ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆయన సోదరి ప్రియాంకగాంధీ మధ్య కాన్పూర్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్, ప్రియాంకలు బిజీగా ఉన్నారు. కాన్పూర్ ఎయిర్‌పోర్టులో శనివారం చెల్లెలు ప్రియాంకను కలిసిన రాహుల్ సరదాగా మాట్లాడారు. 'నేను చాలా మంచి అన్నయ్యను. చెల్లెలి కోసం పెద్ద త్యాగం చేశాను. ఎన్నికల ప్రచారానికి వెలుతున్న సోదరికి విశాలమైన హెలీకాప్టర్‌ను కేటాయించా. సుదూర ప్రయాణాలు, సుడిగాలి పర్యటనలు చేస్తున్న నేను మాత్రం చిన్న హెలీకాప్టర్‌తో సరిపెట్టుకున్నా' అని నవ్వుతూ అన్నారు.
ఆ సమయంలో పక్కనే ఉన్న ప్రియాంక నా పరువు తీయకు సోదరా అంటూ అడ్డుకునేందకు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇద్దరు ఎవరి ప్రచారానికి వాళ్లు వెళ్లిపోయారు. ఈ సన్నివేశాన్ని అక్కడ ఉన్నవాళ్లు ఆసక్తిగా తిలకించారు. కాన్పూర్ హెలీప్యాడ్‌లో జరిగిన ఈ సరదా ఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.