
నరేంద్ర మోడీ ప్రధాని అయితే సంతోషిస్తా: అద్వానీ
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఎంపిక చేయడాన్ని తీవ్రంగా విభేదించిన పార్టీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ తన మనసు మార్చుకున్నారు. మోడీ ప్రధాని అయితే సంతోషిస్తానని అన్నారు. బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో అద్వానీ మాట్లాడుతూ.. మోడీ నాయకత్వంలో గుజరాత్ సాధించిన ప్రగతిని చూసి భారత్లో మాత్రమే గాక ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని అన్నారు.
మోడీని ప్రధానిగా ఎంపిక చేసిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గైర్హాజరైన అద్వానీ ఆ తర్వాత పలు సమావేశాల్లో మోడీ కలసి వేదిక పంచుకున్నా అంటిముంటనట్టు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయన మనసు మార్చుకుని మోడీని ఆశ్వీరదించడం విశేషం. ఇదిలావుండగా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ నాయకులు ధ్వజమెత్తారు.