కుప్పకూలిన మరో విమానం | IAF aircraft crashes, 5 killed | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన మరో విమానం

Published Fri, Mar 28 2014 1:50 PM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM

కుప్పకూలిన మరో విమానం

కుప్పకూలిన మరో విమానం

భారత వైమానిక దళానికి మరో గట్టి దెబ్బ తగిలింది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన సీ-130 జె హెర్కులిస్ స్పెషల్ ఆపరేషన్స్ విమానం గ్వాలియర్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అయిదుగురు చనిపోయారు.


ఈ విమానం ఆగ్రా నుంచి ఉదయం పది గంటలకు టేకాఫ్ చేసింది. పైలట్ల శిక్షణ కోసం బయలుదేరిన ఈ విమానం గ్వాలియర్ కి 72 కి.మీ దూరంలో కుప్పకూలింది. దీనిలో ప్రయాణిస్తున్న అయిదుగురు చనిపోయారు.


మన వైమానిక దళం ఈ మధ్యే ఆరు సీ-130 జె హెర్కులిస్ స్పెషల్ ఆపరేషన్స్ విమానాలను రూ. 6000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. ఈ విమానాలను సియాచిన్ కు వెళ్లేందుకు ప్రధాన విమానాశ్రయమైన దౌలత్ బేగ్ ఓల్డీ కి వెళ్లడానికి ఉపయోగిస్తున్నారు. ఇటీవలే ఒక విమానం దౌలత్ బేగ్ ఓల్డీకి విజయవంతంగా వెళ్లి వచ్చింది. ఇప్పుడు అదే తరహా విమానం ప్రమాదానికి గురి కావడంతో వైమానిక దళానికి గట్టి దెబ్బ తగిలినట్టయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement