
చండీగఢ్: కోవిడ్–19 బాధితులకు సేవలందించేందుకు పంజాబ్‌లోని రోపార్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) శాస్త్రవేత్తలు ప్రత్యేక రోబోట్‌ను తయారు చేశారు. ఆసుపత్రుల్లో వార్డ్‌బోట్‌ల వాడకం ద్వారా వైద్యసిబ్బంది వైరస్ బారిన పడటాన్ని తగ్గించవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి రోగులకు మందులు, ఆహారం అందివ్వగలవని అసోసియేట్ ప్రొఫెసర్ ఎక్తా సింగ్లా తెలిపారు. ఇవి చేతులు ఊపడం వంటి సంజ్ఞలను అర్థం చేసుకోగలవని వివరించారు. కంట్రోల్ రూం ద్వారా ఏకకాలంలో వేర్వేరు వార్డుల్లోని రోబోలను నియంత్రించడం, ఆదేశాలివ్వడం సాధ్యమని... తరచూ తనని తాను శానిటైజర్ ద్వారా శుభ్రం చేసుకోవడం వార్డుబోట్‌కు ఉన్న మరో ప్రత్యేకత అని తెలిపారు.