ఉల్లి ఎగుమతి ధరల పెంపు | India hikes minimum export price of onions by 67 percent | Sakshi
Sakshi News home page

ఉల్లి ఎగుమతి ధరల పెంపు

Published Wed, Jul 2 2014 3:47 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

ఉల్లి ఎగుమతి ధరల పెంపు - Sakshi

ఉల్లి ఎగుమతి ధరల పెంపు

ఉల్లి ఎగుమతి ధరలను ప్రభుత్వం భారీగా పెంచింది. టన్నుకు 500 డాలర్లు కనీస ఎగుమతి ధర ఉండాలంటూ.. 67 శాతం మేర పెంచింది.

ఉల్లి ఎగుమతి ధరలను ప్రభుత్వం భారీగా పెంచింది. టన్నుకు 500 డాలర్లు కనీస ఎగుమతి ధర ఉండాలంటూ.. 67 శాతం మేర పెంచింది. స్వదేశీ మార్కెట్లలో ఉల్లి ధరలు మండిపోతుండటంతో.. ఎగుమతులను నిరోధించేందుకు ఈ చర్య తీసుకుంది. పెంచిన ధరల ప్రకారం, కిలో ఉల్లిపాయల ఎగుమతి ధర కనీసం 30 రూపాయలు ఉండాలి.

ప్రస్తుతం స్వదేశీ మార్కెట్లలో ఉల్లిధరలు కిలోకు రూ. 20-30 వరకు ఉన్నాయి. ఉల్లి ఎగుమతి ధరలను పెంచాలన్న నిర్ణయాన్ని మంత్రుల కమిటీలో ఏకగ్రీవంగా తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇంతకుముందు టన్ను ఉల్లిపాయలకు కనీస ఎగుమతి ధర 300 డాలర్లుగా ఉండేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement