'ద్వైపాక్షిక సంబంధాలపై త్వరలోనే చర్చిస్తాం'
ఇస్లామాబాద్: భారత్-పాక్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ముందడుగు పడ్డట్లు కనిపిస్తోంది. పాక్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్‌తో భేటీ అయ్యారు. అనంతరం జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్తో సుమారు 105 నిమిషాల పాటు ఆమె చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ముఖ్యంగా శాంతి, భద్రతా అంశాలు, ద్వైపాక్షిక సంబంధాల అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం జరిగిన ఈ భేటీ వివరాలను మీడియాతో మాట్లాడారు.
- భారత్-పాక్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, శాంతిభద్రతలు కట్టుదిట్టం చేసేందుకు ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయం
- జమ్మూకశ్మీర్, సియాచిన్, ఆర్థిక వాణిజ్య పరమైన సహకారం, నార్కోటిక్స్ నియంత్రణ, టెర్రరిజం లాంటి ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ఇరుదేశాలు అంగీకారం
- ఇరు దేశాల మధ్య సమగ్ర ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధణ కోసం భారత్-పాక్ దేశాల విదేశాంగశాఖ కార్యదర్శులు సమావేశం అవుతారు
- ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై భారత్-పాక్ విదేశాంగశాఖ కార్యదర్శులు చర్చిస్తారు
- పార్లమెంట్లో ఈ చర్చలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తామన్న సుష్మా స్వరాజ్
- టెర్రరిజం లాంటి వాటికి సహకరించవద్దని పాక్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశాం