pm nawaz sharif
-
పాక్ ప్రధానిపై విరుచుకుపడ్డ ఉగ్రవాది
కరాచీ: బహిరంగంగా సంచరిస్తోన్న ఉగ్రవాది ప్రభుత్వాధినేతపైనే ధ్వజమెత్తాడు. దాయాది దేశ అంతర్గత వ్యవహారంలో తలను పూర్తిగా దూర్చాలని ప్రధానమంత్రిని హెచ్చరించాడు. ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్ శుక్రవారం పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధాని నవాజ్ షరీఫ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. శుక్రవారం కరాచీలోని మర్కజ ఇ తఖ్వా మసీదులో నిర్వహించిన శాంతి సభలో హఫీజ్ ఈ మేరకు ఘాటు ప్రసంగం చేశాడు. 'అవతల భారత్ ఆధీనంలోని కశ్మీరీలు కష్టాల్లో ఉన్నారు. అక్కడి సైన్యం చేతిలో చావుదెబ్బలు తింటున్నారు. వారిపట్ల పాకిస్థాన్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఏవో రెండు మూడు హెచ్చరికలు తప్ప ఈ విషయంలో ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిందేమీలేదు. పాక్ ప్రభుత్వం తక్షణమే కశ్మీరీలకు అవసరమైన 'అన్నిరకాల' సహాయసహకాలు అందించాలి'అని హఫీజ్ సయీద్ అన్నాడు. కశ్మీర్ అంశంలో కలుగజేసుకోకుండా ఉండేలా పాకిస్థాన్ లో రాజకీయ అస్థిరత సృష్టించాలని భారత్ ప్రయత్నిస్తోందని, ఆ ప్రయత్నాలను ధీటుగా తిప్పికొట్టాలని హఫీజ్ పిలుపునిచ్చాడు. దేశమంతా క్వెట్టా ఉగ్రదాడి విషాదంలో ఉన్న తరుణంలో హఫీజ్ చేసిన వ్యాఖ్యలను పాక్ మీడియా సైతం తప్పుపట్టడం గమనార్హం. గతవారం క్వెట్టాలోని పోలీస్ అకాడమీపై ఉగ్రవాదులు విరుచుకుపడి, 59 మంది ట్రైనీ పోలీసులను పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. -
పాక్ సిద్ధమే.. భారత్ సిద్ధమేనా: షరీఫ్
ఇస్లామాబాద్: భారత్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. కశ్మీర్ సమస్యలను పరిష్కారించాలని భారత్ కూడా భావించినట్లయితే అందుకు తమకు ఏ అభ్యంతరం లేదని షరీష్ తెలిపారు. మూడో రోజుల పర్యటనలో భాగంగా అజర్ బైజాన్, బాకులో ఉన్న పాక్ ప్రధాని మీడియాతో మాట్లాడాతూ.. కశ్మీర్లో కొనసాగుతున్న హింస, ఇతర ముఖ్య సమస్యలపై చర్చించాలని పాక్ పలు పర్యాయాలు భారత్ కు ఆహ్వానం పంపినా ప్రయోజనం లేకపోయిందన్నారు. భారత్-పాక్ మధ్య అశాంతియుత వాతావరణం నెలకొనడానికి కశ్మీర్ అంశమే ప్రధాన కారణమని షరీష్ అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సూచన మేరకు భారత్ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. ఉడీలోని భారత ఆర్మీ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడికి పాకిస్తాన్ పనేనన్న భారత్ ఆరోపణలను మరోసారి కొట్టిపారేశారు. లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్వోసీ) వద్ద పాక్ ఎలాంటి చొరబాట్లకు యత్నించలేదన్నారు. ఉడీలో జరిగిన ఉగ్రదాడిలో 19 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. -
యుద్ధంపై పాక్ ప్రధాని అధికారిక ప్రకటన
ఇస్లామాబాద్: ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. బుధవారం పాకిస్థాన్ పార్లమెంట్ ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఉడీ ఉగ్రదాడితో పాకిస్థాన్ కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఉడీ దాడి జరిగిన కొద్ది గంటల్లోపే ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్.. పాకిస్థాన్ ను నిందించిందని ఆక్షేపించారు. పాకిస్థాన్ ను శాంతికాముక దేశంగా అభివర్ణించిన నవాజ్.. తాము భారత్ తో యుద్ధం చేయాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కీలకమైన కశ్మీర్ సహా ఇండియాతో నెలకొన్న అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు సభకు చెప్పారు. అయితే తమ ప్రమేయం లేకుండా ఎదురయ్యే విపత్కర పరిస్థితులను తిప్పికొట్టేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉందన్నారు. -
పాక్ ప్రధానిపై అనర్హత వేటు!
లాహోర్: ఏ దేశ ప్రధాని మాట్లాడటానికి సాహసించని రీతిలో ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాది బుర్హాన్ వనీని కీర్తించడమేకాక ఉడీ దాడి కశ్మీర్ ఆందోళనలకు కొనసాగింపని ఉగ్రవాదులను పచ్చిగా వెనకేసుకొచ్చిన పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అవినీతి ఆరోపణల విషయంలో తీవ్ర రాజకీయ సంక్షోబాన్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలల కిందట ప్రకంపనలు సృష్టించిన 'పనామా పేపర్స్' వ్యవహారంలో నవాజ్ షరీఫ్ పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. విదేశీ కంపెనీల ముసుగులో వేల కోట్ల అక్రమ సంపాదనను పోగేసుకున్నవారి జాబితాలో షరీఫ్ పేరు పై వరుసలో కనిపించింది. దీంతో షరీఫ్ పై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. పనామా పేపర్స్ లీకేజీల ఆధారంగా అసెంబ్లీ రూల్స్ లోని 62,63 నిబంధనలను అనుసరించి ప్రధాని నవాజ్ షరీఫ్ జాతీయ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దుచేసి, అనర్హుడిగా ప్రకటించాలని ప్రతిపక్ష పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. ఆ క్రమంలోనే పీటీఐ సభ్యులు ఆగస్టు 15న అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సిద్దిఖీకి ఒక నివేదిక సమర్పించారు. అందులో షరీఫ్ అక్రమ ఆస్తులు, ఇతర ఆర్థిక నేరాల చిట్టాలను పొందుపర్చారు. కాగా, ఆ నివేదికను జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాస్ సిద్దిఖీ శనివారం పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ కు పంపారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాన్ని బట్టి నవాజ్ రాజకీయ భవితవ్యం ఉడబోతోంది. అయితే విచారణ జరపకుండా నవాజ్ పై వేటు వేసే అవకాశమేలేదని, ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలని అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ వ్యాఖ్యానించింది. -
మేం కూడా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించగలం:షరీఫ్
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్(నిర్దేశిత దాడి) నిర్వహించడంతో షాక్ కు గురైంది. దాడిపై శుక్రవారం ఏర్పాటు చేసిన కేబినేట్ సమావేశంలో పాల్గొన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తమకూ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించ గల సామర్ధ్యం ఉందని పేర్కొన్నారు. దేశ భద్రతకు ఎవరైనా ఆటంకం కలగజేయాలని ప్రయత్నిస్తే.. చూస్తూ ఊరుకోమని అన్నారు. నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నా ప్రజలను, దేశ సమగ్రతను కాపాడుకోగల సత్తా పాక్ కు ఉందని చెప్పారు. భారత్ దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని షరీఫ్ వ్యాఖ్యానించినట్లు ఓ ప్రముఖ పాకిస్తాన్ పత్రిక పేర్కొంది. నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు భారత ఆర్మీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, భారత్ ప్రకటనను పాక్ తోసిపుచ్చింది. ఉడి ఉగ్రదాడిపై విచారణ చేయాలని షరీఫ్ ఆదేశించినట్లు తెలిసింది. దాడిలో పాక్ హస్తం ఉందని భారత్ చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని షరీఫ్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. -
భారతీయుడికి సహకరించిన పాక్ జర్నలిస్టు కిడ్నాప్
లాహోర్: గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ జైల్లో ఉన్న భారత ఇంజనీర్ హమీద్ అన్సారీ కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు పరిశోధిస్తున్న పాక్ మహిళా జర్నలిస్టు జీనత్ షాజది అదృశ్యమవడంతో ఆమె ఆచూకీ చెప్పాలంటూ కుటుంబ సభ్యులు దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విజ్ఞప్తి చేశారు. 7 నెలలుగా జీనత్ కనిపించడం లేదని, భారతీయ ఖైదీకి సాయపడడం వల్లే ఈ సంఘటన జరిగిందని సోదరుడు సల్మాన్ లతీఫ్ సోమవారం తెలిపాడు. తన సోదరి కనిపించక బెంగతో మరో సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ క్షోభ భరించలేమని వాపోయాడు. స్థానిక పత్రికా విలేకరిగా పనిచేస్తున్న జీనత్ ఆగస్టు 19, 2015న ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తుండగా అదృశ్యమైంది. నవంబర్, 2012 నుంచి భారత్‌కు చెందిన హమీద్ పాకిస్తాన్ వెళ్లి కనిపించకుండా పోయాడు. హమీద్ తల్లి ఫౌజియా తరఫున సుప్రీంకోర్టులోని మానవహక్కుల విభాగంలో జీనత్ పిల్ దాఖలు చేశారు. ఈ కేసుపై పెషావర్ హైకోర్టులోనూ ఆమె వాదించారు. పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం సమాచారం మేరకు... పాక్ యువతితో హమీద్(28) ఫేస్బుక్లో ప్రేమలో పడ్డాడు. పాక్ వెళ్లేందుకు వీసా రాకపోవడంతో కాబూల్ నుంచి పాకిస్తాన్ చేరుకున్నాడు. నవంబర్ 12, 2012న పాక్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని భద్రతా సంస్థలకు అప్పగించారు. -
లాడెన్ డబ్బుతో ఎన్నికల బరిలో షరీఫ్!
ఇస్లామాబాద్: దివంగత పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)ని ఎదుర్కొనేందుకు 1990 ఎన్నికల్లో నిలబడేందుకు కావాల్సిన భారీ మొత్తాలను ప్రస్తుత ప్రధాని నవాజ్ షరీఫ్ అల్ కాయిదా అధినేత లాడెన్ నుంచి పొందారని ఓ పుస్తకంలో వెల్లడైంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ మాజీ ఉన్నతాధికారి ఖలీద్ ఖవాజా భార్య షమామా ఖలీద్ వెలువరించిన ‘ ఖలీద్ ఖవాజా: షాహీదీ అమాన్’ పుస్తకంలో ఈ విషయాలు వెలుగుచూశాయి. పాక్‌లో ఇస్లామిక్ రాజ్యస్థాపనకు షరీఫ్ ప్రతినబూనడంతో ఆయనవైపు లాడెన్, ఖలీద్‌లు ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. జియాల తుది దశలో 1990లో పీపీపీని ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు కావాల్సిన భారీ నగదు మొత్తాలను లాడెన్ నుంచి తీసుకున్నాడని, అధికారంలోకి వచ్చాక షరీఫ్ తన వాగ్దానాలను పక్కనబెట్టాడని ‘డాన్’ వార్తాసంస్థ సోమవారం ఓ కథనం ప్రచురించింది. -
'ద్వైపాక్షిక సంబంధాలపై త్వరలోనే చర్చిస్తాం'
ఇస్లామాబాద్: భారత్-పాక్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ముందడుగు పడ్డట్లు కనిపిస్తోంది. పాక్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్‌తో భేటీ అయ్యారు. అనంతరం జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్‌తో సుమారు 105 నిమిషాల పాటు ఆమె చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ముఖ్యంగా శాంతి, భద్రతా అంశాలు, ద్వైపాక్షిక సంబంధాల అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం జరిగిన ఈ భేటీ వివరాలను మీడియాతో మాట్లాడారు. భారత్-పాక్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, శాంతిభద్రతలు కట్టుదిట్టం చేసేందుకు ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయం జమ్మూకశ్మీర్, సియాచిన్, ఆర్థిక వాణిజ్య పరమైన సహకారం, నార్కోటిక్స్ నియంత్రణ, టెర్రరిజం లాంటి ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు ఇరుదేశాలు అంగీకారం ఇరు దేశాల మధ్య సమగ్ర ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధణ కోసం భారత్-పాక్ దేశాల విదేశాంగశాఖ కార్యదర్శులు సమావేశం అవుతారు ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై భారత్-పాక్ విదేశాంగశాఖ కార్యదర్శులు చర్చిస్తారు పార్లమెంట్లో ఈ చర్చలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తామన్న సుష్మా స్వరాజ్ టెర్రరిజం లాంటి వాటికి సహకరించవద్దని పాక్ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశాం -
పాక్ ప్రధానితో సుష్మా భేటీ
ఇస్లామాబాద్: భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్‌ను కలిశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఆమె ఆయనతో భేటీ అయ్యారు. ఆసియా దేశాల ప్రాంతీయ సదస్సు 'హార్ట్ ఆఫ్ ఆసియా' కారక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సుష్మాస్వరాజ్ ఇస్లామాబాద్ వెళ్లిన విషయం తెలిసిందే. అదే రోజు కార్యక్రమం కూడా ప్రారంభమైంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ 5వ సదస్సులో 14 సభ్య దేశాలు, 17 మిత్రదేశాలు, 12 అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా ఆమె షరీఫ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆమె పాకిస్థాన్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ తో కూడా భేటీ అవ్వనున్నారు. షరీఫ్ తో భేటకంటే ముందు ఆమె ఇరు దేశాల మరింత స్నేహభావంతో మెలుగుతూ వర్తక వాణిజ్యాలను పెంపొందించుకోవాలని, ఈవిషయంలో ఇరు దేశాలు కూడా పరిపక్వతతో ఆలోచించాలని చెప్పిన విషయం తెలిసిందే. -
పాక్‌తో సత్సంబంధాల దిశగా!
-
హలో మోదీగారూ.. నేను షరీఫ్‌ని
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీకి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సర్ ప్రైజ్ పోన్ కాల్ చేశారు. భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన భారతీయుల కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేపాల్‌లో భూకంప బాధితులకు సేవలు అందించడంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న భారత్‌పై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. నేపాల్ కు మీరు అందిస్తున్న సేవలు చాలా గొప్పవంటూ మోదీని కొనియాడారు. గురువారం ఉదయాన్నే సర్ ప్రైజ్‌గా మోదీకి షరీఫ్ ఫోన్ చేశారు. సాధారణంగా ప్రత్యేక సందర్భాల్లో తప్ప భారత్ పాక్ మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు నడవని విషయం తెలిసిందే. నేపాల్‌కు సహాయం అందించడంలో భారత్ ముందుడటాన్ని ఒక్కపాకిస్థానే కాకుండా ప్రపంచం మొత్తం గుర్తించింది. -
ఇస్లామాబాద్‌లో పరిస్థితి ఉద్రిక్తం
కరాచీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఆ దేశంలో రోజురోజూకు తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇస్లామాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఆందోళనలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రధాని నవాజ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లతో ఇస్లామాబాద్ మారుమోగుపోతుంది. దాంతో ఇస్లామాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇస్లామాబాద్‌లో అత్యవసర పరిస్థితిని ప్రభుత్వం ప్రకటించింది.