చదరంగంలో భారత్ త్వరలో చైనాతో తలపడనుంది. మార్చి 1 నుంచి 10 వరకు ఈ రెండు దేశాల మధ్య చెస్ పోటీలు హైదరాబాద్లో జరగనున్నట్లు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) పేర్కొంది. ఇప్పటికే ఈ రెండు దేశాలు చెస్లో చెరోసారి పతకాలు గెలుచుకున్నాయి.
మొత్తం 8 రౌండ్లలో ఈ ఆట కొనసాగనుంది. ఒక్కొక్కరు తన ప్రత్యర్థిని రెండుసార్లు ఇందులో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఆటలో విజేతకు రూ. 10 లక్షలు అందించనున్నారు. ఈ ఆటను రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించనున్నట్లు ఏఐఎస్ఎఫ్ చీఫ్ భరత్సింగ్ తెలిపారు.