భారత్‌ ఉన్నా.. లేకున్నా పర్లేదు: చైనా | India's Refusal to Join Belt and Road Summit Regrettable, Says Chinese Media | Sakshi
Sakshi News home page

భారత్‌ ఉన్నా.. లేకున్నా పర్లేదు: చైనా

Published Mon, May 15 2017 11:56 AM | Last Updated on Mon, Aug 13 2018 3:35 PM

భారత్‌ ఉన్నా.. లేకున్నా పర్లేదు: చైనా - Sakshi

భారత్‌ ఉన్నా.. లేకున్నా పర్లేదు: చైనా

చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌' కార్యక్రమానికి భారత్‌ హాజరుకాకపోవడంపై ఆ దేశ మీడియా స్పందించింది. వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌లో భారత్‌ పాలుపంచుకున్నా.. లేకున్నా.. మిగిలిన భాగస్వామ్య దేశాలకు ఎలాంటి నష్టం ఉండదని పేర్కొంది. రెండు రోజుల పాటు జరిగిన వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ కార్యక్రమానికి 29 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.

భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ చైనా పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌(సీపెక్‌) కశ్మీర్‌లోని గిల్గిత్‌ బాల్టిస్తాన్‌ నుంచి వెళ్తుండటంతో వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ కార్యక్రమానికి వెళ్లకూడదని భారత్‌ నిర్ణయించుకుంది. అన్నట్లుగానే కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై చైనా జాతీయ పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఓ కాలమ్‌ను ప్రచురించింది.

భారత్‌ రాకపోవడం వల్ల కలిగే నష్టమేమి లేదని చెప్పింది. ఒక దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే పనులను చైనా చేయదని ఆ దేశ అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ చేసిన వ్యాఖ్యలను కాలమ్‌లో పునరుద్ఘాటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement