ముంబై: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రస్తుత పన్నుల విధానంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మునిగంటివార్ స్పష్టం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పన్నుల విధానంలో లోపాలను నిర్మూలించి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే శాఖల్లో ప్రస్తుతం ఉన్న ఖాళీలను త్వరలోనే భర్తీచేస్తామని చెప్పారు. రాష్ట్రానికి ప్రతి యేటా అమ్మకపు పన్ను శాఖ నుంచి రూ.69వేల కోట్లు, ఎక్సైజ్ నుంచి రూ.11,500 కోట్లు, రవాణా శాఖ నుంచి రూ.5,500 కోట్లు ఆదాయం సమకూరుతున్నట్లు మంత్రి సుధీర్ వివరించారు.
అలాగే పెట్రోలియం ఉత్పత్తుల నుంచి రాష్ట్ర వాటాగా యేటా రూ.1,500 కోట్లు సమకూరుతోందన్నారు. ఆయా శాఖల్లో సమూల మార్పుల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు తమ ప్రభుత్వం త్వరలో కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు.
పన్నుల విధానంలో మార్పులు అనివార్యం
Published Sat, Nov 22 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement