దేశ భద్రత సమాచారం ఇవ్వలేం | Info on efficacy of anti-riot pellet gun refused under RTI | Sakshi
Sakshi News home page

దేశ భద్రత సమాచారం ఇవ్వలేం

Published Fri, Sep 16 2016 11:51 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

Info on efficacy of anti-riot pellet gun refused under RTI

న్యూఢిల్లీ: హింసాత్మక ఘటనల్లో అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ఉపయోగించే పెల్లెట్‌ గన్‌ల సామర్థ్యం, ఇతర సమాచారాన్ని బయటకు వెల్లడించేందుకు ఇండియన్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ(ఐవోఎఫ్‌) నిరాకరించింది. సెక్షన్‌ 8(1)ఏ ప్రకారం దేశ భద్రత, వ్యూహాత్మక విషయాలను బయటికి వెల్లడించడం కుదరదని, సెక్షన్‌ 8(1)డీ ప్రకారం వాణిజ్యపరమైన గోప్యత పాటించవచ్చని తెలిపింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని కోరిన ఓ వ్యక్తికి ఐవోఎఫ్‌ స్పష్టం చేసింది.

కామన్‌వెల్త్‌ మానవ హక్కుల కార్యకర్త అయిన వెంకటేశ్‌ నాయక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి పెల్లెట్‌ గన్‌ల ధర, వాటి అమ్మకాల వివరాలు, వాటిలో వాడే మందుగుండు సామగ్రి, 2010 నుంచి తుపాకీల లావాదేవిలకు సంబంధించిన రికార్డులు ఇవ్వమని కోరాడు. దేశ భద్రతకు సంబధించిన సమాచారామని బయటకు వెల్లడించడం కుదరదని తెలిపింది. దీనికై అతడు చేసిన దరఖాస్తును తిరస్కరిస్తునట్టు పుణేలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement