పాశ్చాత్య దేశాల పౌరులు, పర్యాటకులపై భారత్‌లో ఉగ్ర దాడుల అవకాశం ఎక్కువగా ఉందని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయెల్ తమ పౌరులను హెచ్చరించింది.
తమ పౌరులకు ఇజ్రాయెల్ సూచన
జెరూసలెం/న్యూఢిల్లీ: పాశ్చాత్య దేశాల పౌరులు, పర్యాటకులపై భారత్‌లో ఉగ్ర దాడుల అవకాశం ఎక్కువగా ఉందని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయెల్ తమ పౌరులను హెచ్చరించింది. ముఖ్యంగా భారత్‌లోని నైరుతి ప్రాంతంలో ఈ ముప్పు మరీ ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని కార్యాలయం, ఉగ్రవాద వ్యతిరేక దళం ఒక ప్రకటన విడుదల చేశాయి. ‘భారత్‌కు వెళ్లే ఇజ్రాయెల్ పర్యాటకులు ఎప్పటికప్పుడు స్థానిక మీడియా నివేదికలను, భద్రతా దళాల హెచ్చరికలపై దృష్టి సారించాలి.
భారత్‌లో ఎవరైనా బంధువులు ఉంటే వారి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకొని పర్యటించాలి. అలాగే నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా బీచ్ పార్టీలు, క్లబ్‌లు లాంటి జనసంచారం ఎక్కువగా ఉండే చోట అప్రమత్తంగా ఉండాలి’ అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.