ఆర్పీఎఫ్ జవాన్లపై రేప్ కేసు.. | jawans booked on rape charge | Sakshi
Sakshi News home page

ఆర్పీఎఫ్ జవాన్లపై రేప్ కేసు..

Published Thu, Sep 8 2016 3:01 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

jawans booked on rape charge

థానెః ప్రజలకు, దేశ పౌరులకు భద్రత కల్పించాల్సిన సైనికులే మహిళపై ఆఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెంట్రల్ రైల్వేకు చెందిన నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లు 25 ఏళ్ళ వివాహిత మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు నమోదు చేసినట్లు సెంట్రల్ రైల్వే డీపీసీ రుపాలీ అంబురే తెలిపారు.

దివాలోని ఆర్పీఎఫ్ క్యాబిన్ లో జనవరి 14న తనపై జవాన్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా బాధిత మహిళ ఇటీవల ఫిర్యాదు చేయడంతో నలుగురు ఆర్పీఎఫ్ జవాన్లపై థానే రైల్వే పోలీసులు రేప్ కేసు నమోదు చేసినట్లు ఆమె వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 376-డి, 326 ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. కేసు కమిషనరేట్ పరిథిలోది కావడంతో థానె సిటి పోలీసులకు బదిలీ చేశామని చెప్పారు. బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు డీసీపీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement