తమిళనాడుకు ప్యాకేజీ కోరలేదు | Jayalalitha meets Narendra Modi | Sakshi
Sakshi News home page

తమిళనాడుకు ప్యాకేజీ కోరలేదు

Published Tue, Jun 3 2014 6:27 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

తమిళనాడుకు ప్యాకేజీ కోరలేదు - Sakshi

తమిళనాడుకు ప్యాకేజీ కోరలేదు

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల అనంతరం జయలలిత మోడీతో సమావేశమవడం ఇదే తొలిసారి. మోడీతో భేటీ అనంతరం జయలలిత మాట్లాడుతూ.. తమిళనాడుకు ప్రత్యేక ప్యాకేజీ కోరలేదని అన్నారు. అవసరమైతే రాజ్యసభలో ఎన్డీఏకే మద్దతు ఇస్తామని చెప్పారు.

మోడీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్షేను ఆహ్వానించడాన్ని జయలలిత తీవ్రంగా వ్యతిరేకించారు. లంకలో తమిళుల ఊచకోతకు కారణమైన రాజపక్షేను పిలవడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఎన్డీఏలో జయలలిత చేరుతారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. జయ సారథ్యంలోని అన్నా డిఎంకే తమిళనాడులో ఘనవిజయం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement