
బెయిల్ కోసం హైకోర్టుకు జయలలిత
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడ్డ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ కోసం సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించనున్నారు. తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని జయలలిత కోరనున్నారు.
న్యాయపరమైన అంశాలపై జయలలిత న్యాయనిపుణులతో చర్చించారు. బెయిల్ పిటీషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశముంది. మూడేళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడితే హైకోర్టే బెయిల్ ఇవ్వాలని జయ తరపు న్యాయవాది ప్రసాద్ చెప్పారు.