సుప్రీంకోర్టు సరిగా వ్యవహరించలేదు: జస్టిస్ గంగూలీ
కోల్కతా: జడ్జీగా తాను ఇచ్చిన కొన్ని తీర్పులను గిట్టని శక్తిమంతులు తన ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఏకే గంగూలీ ఆరోపించారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణ విషయంలో సుప్రీంకోర్టు తన పట్ల సరిగా వ్యవహరించలేదని ఆక్షేపించారు.ఈ మేరకు ఆయన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివంకు ఫిర్యాదు చేస్తూ ఎనిమిది పేజీల లేఖ రాశారు. లేఖ ప్రతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపుతున్నట్లు తెలిపారు.తన వద్ద పనిచేసే న్యాయ విద్యార్థినిపై గత ఏడాది డిసెంబర్ లోని ఓ హోటల్లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
దీనిపై పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల కమీషన్ చైర్మన్ పదవి కూడా రాజీనామా చేయాలని ఆయనపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తన వాదన వినిపిస్తూ 36 అంశాలతో కూడిన లేఖను సీజేఐకి రాశారు.