సాక్షి, న్యూఢిల్లీ : గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల ఘర్షణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను భావోద్వేగాలతో తప్పుదారిపట్టించరాదని నటుడు, రాజకీయనేత కమల్ హాసన్ కోరారు. చైనా మన భష్త్రభాగాన్ని ఆక్రమించలేదని, మన పోస్ట్‌ను స్వాధీనం చేసుకోలేదని అఖిలపక్ష భేటీలో ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రశ్నించిన వారిపై తప్పుడు వక్రీకరణలు చేస్తున్నారని ప్రచారం చేయడం పట్ల కమల్ విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన ప్రకటనలతోనే ప్రజల్ని భావోద్వేగపూరిత పద్ధతుల్లో తప్పుదారిపట్టిస్తోందని మక్కల్ నీది మయ్యం చీఫ్ దుయ్యబట్టారు.
ఈ తరహా ప్రచారం మానుకోవాలని ప్రధానితో పాటు ఆయన మద్దతుదారులకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. ప్రశ్నించేవారిని జాతివ్యతిరేకులుగా చిత్రించడం సరికాదని, ప్రశ్నించడం ప్రజాస్వామిక హక్కని అన్నారు. వాస్తవం తమ చెవిన పడేవరకూ తాము ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రధాని అఖిలపక్ష సమావేశంలో వెల్లడించిన అంశాలు ఆర్మీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటనలకు భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా అఖిలపక్ష భేటీలో ప్రభుత్వం వాస్తవాధీన రేఖ వెంబడి వాస్తవ పరిస్థితులను పూర్తిగా వివరించలేదని విపక్ష పార్టీలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment