ప్రధానిపై విమర్శలు.. సుష్మపై ప్రశంసలు!
కొద్ది నిమిషాల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆయన మంత్రివర్గంలోని సభ్యురాలు సుష్మా స్వరాజ్‌పై మాత్రం ప్రశంసలు కురిపించారు. ఈ రెండూ కూడా ట్వీట్ల రూపంలో కొద్ది నిమిషాల తేడాలో రావడం గమనార్హం. సుష్మాస్వరాజ్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ఉత్తరాఖండ్ విషయంలో ప్రధానిపై మండిపడిన కాసేపటికే ఆయనీ మాట చెప్పారు.
నైజీరియాలో సముద్రపు దొంగల చెరలో ఉన్న భారతీయ ఇంజనీర్ సంతోష్ భరద్వాజ్‌ను విడిపించే విషయంలోను, ఆ సంగతిని ఆయన భార్యకు చెప్పడంలోను విదేశీ వ్యవహారాల మంత్రిగా సుష్మ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. సుష్మా స్వరాజ్‌కు తాను ధన్యవాదాలు చెబుతున్నానని, విదేశాల్లో ఉన్న భారతీయులను కాపాడేందుకు ఆమె చాలా బాగా పనిచేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ కూడా అన్నారు. ఒక మంత్రిగా ఆమె స్పందన అద్భుతంగా ఉందని బిజూ జనతాదళ్ సభ్యుడు బైజయంత్ పాండా చెప్పారు.
Modi Govt shud apologise to the nation for acting in unconstitutional and undemocratic manner in Uttarakhand
— Arvind Kejriwal (@ArvindKejriwal) 11 May 2016
Sushma ji is doing excellent work https://t.co/7SE43oboBe
— Arvind Kejriwal (@ArvindKejriwal) 11 May 2016