తిరువనంతపురం : కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా లక్‌డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ను సక్రమంగా అమలు చేసేందుకు పోలీసులు, ఇతర అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు కొట్టి చెబుతున్నారు. మరికొన్ని చోట్ల లాక్‌డౌన్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ బయటకు రావొద్దని ప్రజలను బ్రతిమిలాడుతున్నారు. అయినప్పటికీ కొంత మంది లాక్‌డౌన్ నియమాలను ఉల్లంఘిస్తున్నారు.
(చదవండి : లాక్‌డౌన్: ఇళ్లకు వెళతాం.. వదిలేయండి!)
లాక్‌డౌన్‌ను కచ్చితంగా అమలు చేసేందుకు కేరళలోని ఓ గ్రామ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. లాక్‌డౌన్ ఉన్నంతకాలం ఇంటికి నుంచి బయటకు రాకుండా ఉన్న కుటుంబాలను బహుమతులు ఇస్తామని ప్రకటించారు. కేరళలోని మలప్పురం జిల్లాలోని తాజెక్కోడ్ గ్రామ పంచాయతీ లాక్‌డౌన్ నిబంధనలు పాటించి ఇంట్లో ఉన్నవారికి బహుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. తొలి బహుమతిగా నాలుగు గ్రాముల బంగారం అందించనున్నారు. అలాగే రెండో బహుమతిగా రిఫ్రిజిరేటర్, మూడో బహుమతిగా వాషింగ్ మెషిన్ అందించనున్నారు. వీటితో పాటు మరో 50 మందికి కాంప్లీమెంటరీ బహుమతులు అందించనున్నారు. మే 3 తర్వాత లక్కీ డ్రా ద్వారా వీటిని ప్రకటిస్తామని గ్రామ అధికారులు తెలిపారు.
(చదవండి : దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం)
గత కొద్ది రోజులుగా కేరళలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రారంభంలో దేశంలోని రాష్ట్రాల్లో కేరళ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగింది. కాని ఆ తర్వాత చాలా వరకు కొత్త కేసులు పెద్దగా నమోదు కాలేదు. ఉన్న కేసుల్లోనే మెరుగైన వైద్య చికిత్స అందించి కోలుకునేలా చేశారు. రాష్ట్రంలో 481 కరోనా పాటిజివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 355 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా బారిన పడి కేరళలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment