సాక్షి, న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు సెప్టెంబర్ 28వ తేదీన సంచలన తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా అయ్యప్ప ఆలయంలో మహిళలకు తగిన సౌకర్యాలు కల్పిస్తామంటూ కేరళ ప్రభుత్వం చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తూ అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు మంగళవారం నాటికి ఊపందుకున్నాయి. ఈ రోజు నుంచి సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆందోళనలను తీవ్రతరం చేయాలని కోచిలో సోమవారం నాడు జరిగిన 41 హిందూ సంఘాల నేతలు నిర్ణయించారు. వీరిలో ఆరెస్సెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ. గోపాలన్‌కుట్టీ కూడా పాల్గొన్నారు. ఆందోళనా కార్యక్రమాల కోసం ఆరెస్సెస్ ఓ కార్యాచరణ సమితి కూడా ఏర్పాటు చేసింది. రాష్ట్ర బీజేపీ శాఖ కూడా ఆందోళనకు మద్దతు ప్రకటించింది. (శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు)
సెప్టెంబర్ 28వ తేదీన సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆరెస్సెస్ నాయకుడు పీ. గోపాలన్ కుట్టీ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. ‘సుప్రీం కోర్టు తీర్పును సంఘ్ పరివార్ శిరసావహిస్తోంది. కులం, లింగ వివక్ష లేకుండా ఆలయంలోకి వెళ్లే సమాన హక్కు భక్తులందరికి ఉండాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ కేరళ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై మాట్లాడుతూ ‘ఆలయాల్లోకి మహిళల ప్రవేశంపై వివక్ష చూపడాన్ని బీజేపీ ఎంత మాత్రం అనుమతించదు’ అని వ్యాఖ్యానించారు.‘మహిళల ప్రవేశాన్ని నియంత్రిస్తున్న ఆలయ యజమాన్యాల మనస్తత్వం మారాలి’ అని ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషీ గతంలో పలుసార్లు వ్యాఖ్యానించారు. (తీర్పులు కాదు..సంప్రదాయాలే ముఖ్యం!)
ఓటు బ్యాంకు రాజకీయాలే
సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అక్టోబర్ రెండున ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు మరుసటి రోజుకే ఊపందుకొని వేల సంఖ్యలో ప్రజలు తరలి వస్తుండడంతో ఆరెస్సెస్, బీజేపీ నాయకులు ఒక్కసారిగా మాట మార్చారు. ఆందోళన బాట పట్టారు. ముంబైలోని హాజి అలీ దర్గాలోకి, శని శింగ్నాపూర్ ఆలయాల్లో మహిళలను అనుమతించాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసినప్పుడు అదే పార్టీ ఇక్కడ అందుకు విరుద్ధంగా వ్యవహరించడమంటే ద్వంద్వ ప్రమాణాలు పాటించడమే. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ, ఆరెస్సెస్‌లు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఆరోపించారు. ఈ రోజు చర్చలకు రావాల్సిందిగా ఆయన పంపిన ఆహ్వానాన్ని ఆందోళన చేస్తున్న హిందూ సంఘాలన్నీ తిరస్కరించాయి.
అయ్యప్ప సేవా సంఘంతో మొదలు
సుప్రీం కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అక్టోబర్ రెండవ తేదీన ఏ రాజకీయ పార్టీతోని సంబంధంలేని అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం పండలంలో శాంతియుతంగా ప్రదర్శన జరిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నాయర్ సర్వీస్ సొసైటీ ‘నామ జప యాత్ర’ పేరిట నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. శబరిమల పూజారుల కుటుంబానికి చెందిన రాహుల్ ఈశ్వర్ నాయకత్వంలోని అయ్యప్ప ధర్మసేన, విహెచ్‌పీ నుంచి బహిష్కతుడైన ప్రవీణ్ తొగాడియా స్థాపించిన అంతరాష్ట్రీయ హిందూ పరిషత్ సహా దాదాపు హిందూ సంస్థలు నేడు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నాయి. (శబరిమల తీర్పును సవాల్ చేయం..)
ఈ ప్రదర్శనల్లో మగవారికన్నా మహిళలే ఎక్కువగా పాల్గొనడం మరీ విచిత్రం. రాష్ట్రంలో 28 శాతం జనాభా కలిగిన ఎఝావా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ‘శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం’తోపాటు ఆదివాసీ, దళిత సంఘాలు నిరసన ప్రదర్శనల్లో పాల్గొనక పోవడమూ విÔó షమే. నిరసన ప్రదర్శనలను ఈ సంఘాల వారు అగ్రవర్ణాల ఆదిపత్య రాజకీయాలుగా వర్ణిస్తున్నాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment