
యువతిని చూస్తున్నాడని కత్తిపోట్లు
హసన్: బస్టాప్‌లో యువతిని అదే పనిగా చూస్తున్నాడని ఓ యువకుడిని కొందరు చిత క్కొట్టారు. కత్తితో పొడిచారు. పక్కనున్న వారు సాయం చేయకపోగా జరుగుతున్న దాడిని తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు. మంగళవారం కర్నాటక రాజధాని బెంగళూరుకు 185 కి.మీ. దూరంలోని హసన్‌లో ఈ దారుణం జరిగింది.
దనుష్ అనే వ్యక్తి బస్టాండ్‌లో ఓ యువతిని చూస్తుండగా పక్కనున్న ఇద్దరు అతనితో గొడవకు దిగారు. సాయం కోసం ధనుష్ తన సోదరుడు, మరో ఇద్దరు స్నేహితులను పిలిచాడు. రెండు వర్గాల మధ్య గొడవ పెద్దదైంది. తన స్నేహితులు మినహా ఇతరులు అడ్డుకోకపోవడంతో ధనుష్‌పై 20 నిమిషాలు దాడి చేసి కత్తితో పొడిచారు.