ఆధారాలు ఇవ్వండి.. లేదా తొలగిస్తాం!
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసుతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయని రాజ్యసభలో ఆరోపణలు చేసిన బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి శుక్రవారం సాయంత్రంలోగా సాక్ష్యాలను చూపాలని, లేకుంటే ఈ అంశంపై చర్చలో ఆయన చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అన్నారు.
సుబ్రమణ్యం స్వామి వద్ద కాంగ్రెస్ నేతలు తప్పు చేశారని ఏవైనా ఆరోపణలు ఉన్నాయా? అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అడిగిన ప్రశ్నకు రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పీజే కురియన్ శుక్రవారం సాయంత్రం 6 గంటలలోగా డాక్యుమెంట్లను సభ ముందు ఉంచాలని ఆదేశించారు. సాయంత్రం 6 గంటల్లోగా చేయకపోతే సుబ్రమణ్యం స్వామి ఆరోపణలన్నీ ఆధారాలు లేనివిగా భావించి రికార్డుల నుంచి తొలగిస్తామని తెలిపారు.