దాణా కుంభకోణం కేసులో జైలుపాలై రెండు నెలలుగా శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్‌కు తాత్కాలికంగా ఊర ట లభించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆయనకు బెయిలు మంజూరు చేసింది. ఇదే కేసులో దోషిగా తేలిన ఇతరులకు గతంలో బెయిలు మంజూరు చేసిన కారణంగా లాలూకు కూడా అదేవిధంగా బెయిలు ఇస్తున్నట్లు పేర్కొంది. సీబీఐ కోర్టు తనకు విధించిన శిక్షపై జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించానని, ఆ విచారణ పూర్తైతీర్పు రావడానికి కనీసం మరో 7, 8 ఏళ్లు పట్టొచ్చని, ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తనకు బెయిల్ మంజూరు చేయాలన్న లాలు అభ్యర్థనను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. లాలు తరఫున సీనియర్ న్యాయవాది రామ్ జఠ్మలానీ వాదించారు. కేసు విచారణ సందర్భంగా 10 నెలలు, శిక్ష ఖరారైన తరువాత 2 నెలలు లాలు జైలు జీవితం గడిపిన విషయాన్ని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దాణా కుంభకోణం కేసుకు సంబంధించి దోషిగా రుజువుకావడంతో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు.
దాణా కేసులో లాలూకు బెయిల్
Published Sat, Dec 14 2013 3:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:34 AM
Advertisement