న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై చర్చించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం లోక్ సభలో వాయిదా తీర్మానం
ఇచ్చింది. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ ...వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. అంతకు ముందు ఆపార్టీ పార్లమెంటరీ సమావేశం పార్లమెంట్లో జరిగింది.
కాగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ప్రత్యేక హోదాపై తొలి నుంచీ డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలన్న లక్ష్యంతో దేశ రాజధానిలో ఒక రోజు ధర్నా చేపట్టాలని నిర్ణయించింది.
ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం
Published Tue, Aug 4 2015 11:16 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM
Advertisement
Advertisement