భోపాల్: భారత్‌లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో జైళ్లలో రద్దీని నివారించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 8వేల మంది ఖైదీలను విడుదల చేసేందుకు అవసరమైన ప్రక్రియను సోమవారం ప్రారంభించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 8,000 మంది ఖైదీలలో 5,000 మందిని 60 రోజుల పాటు పెరోల్‌పై విడుదల చేయనుండగా, గరిష్ట శిక్ష కాలం ఐదేళ్ల లోపు ఉన్న 3 వేలమంది ఖైదీలను 45 రోజుల పాటు మధ్యంతర బెయిల్‌పై విడుదల చేస్తామని ఆ రాష్ట్ర జైళ్ల డైరెక్టర్ జనరల్ సంజయ్ చౌదరి జాతీయ మీడియాతో పేర్కొన్నారు. జైళ్లలో ఎక్కువమంది ఉన్నందున కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
గరిష్టంగా ఏడు సంవత్సరాల శిక్ష విధించిన కేసులలో ఖైదీలను పెరోల్ లేదా మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయడాన్ని పరిశీలించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. రాష్ట్రంలో 125 జైళ్లలో 28,601 మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం మాత్రమే ఉన్నా ప్రస్తుతం 42 వేల మంది ఖైదీలు ఉన్నారు. ఇక కరోనా వైరస్ కారణంగా 47 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, నలుగురు మరణించారు. (కరోనా: కేజ్రివాల్ ప్రభుత్వం కీలక చర్యలు)
Comments
Please login to add a commentAdd a comment