గోవులెక్కడికంటూ పిడిగుద్దులు..మృత్యువాత | Man Dies After Being Beaten by Gau Rakshaks in Rajasthan | Sakshi
Sakshi News home page

గోవులెక్కడికంటూ పిడిగుద్దులు..మృత్యువాత

Published Wed, Apr 5 2017 10:43 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

గోవులెక్కడికంటూ పిడిగుద్దులు..మృత్యువాత

గోవులెక్కడికంటూ పిడిగుద్దులు..మృత్యువాత

జైపూర్‌: గోసంరక్షణ పేరుతో జరిగిన దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఆ దాడికి సంబంధించిన వీడియో కూడా ఒకటి బయటకు వచ్చి సంచలనం రేపుతోంది. రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలో హర్యానాకు చెందిన పెహ్లూఖాన్‌ (55) అనే వ్యక్తి గోవులను తరలిస్తున్నాడు. జాతీయ రహదారి 8పై గోవులతో ఉన్న అతడి వాహనం వెళుతోంది. అదే సమయంలో ఆ రోడ్డులో విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌కు చెందిన కార్యకర్తలు అక్కడే ఉన్నారు.

వారు ఆ వాహనాన్ని ఆపి గోవులను ఎక్కడికి తీసుకెళుతున్నావని, ఎక్కడ కొనుగోలు చేశావని, వాటికి సంబంధించిన పత్రాలు చూపించాలని అడిగారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. దీంతో గోవులను కబేళాకు తరలిస్తున్నారని అనుమానించిన గో సంరక్షణ బృందంలోని నలుగురు వ్యక్తులు వాహన డ్రైవర్‌పై, పెహ్లూ ఖాన్‌పై దాడి చేశారు. పిడిగుద్దులు కురిపించారు. ఫలితంగా ఆ వ్యక్తి తీవ్ర గాయాలపాలై ప్రాణాలుకోల్పోయాడు. ఈ ఘటనను పోలీసులు తీవ్రమైన చర్యగా భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement