గుర్గాన్: ఓ 12ఏళ్ల మైనార్ బాలికను దారుణంగా హత్యచేసిన మహ్మద్ హుస్సేన్ (23) అనే వ్యక్తిని అస్సాం రాష్ట్రంలోని బార్‌పేట్ జిల్లాలో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందుతుడు బాలికపై అత్యాచారానికి యత్నించగా, ఆ బాలిక ప్రతిఘటించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుర్గాన్‌లో గతనెల 30న చోటుచేసుకుంది. మృతురాలి సోదరుడు అస్గర్ అలీ ఫిర్యాదు మేరకు ఫరూక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
మృతురాలి కుటుంబం గత 10 సంవత్సరాలుగా ఫరూక్ నగర్‌లో నివాసముంటున్నారు. అయితే నిందుతుడు మహ్మద్ హుస్సేన్, అస్గర్ అలీ తండ్రి వద్ద 30వేలు అప్పు తీసుకున్నాడు. అ అప్పు తిరగివ్వమని అడిగితే అందుకు హుస్సేన్ తిర్కసరించాడు. దీంతో వారు పెద్దల సమక్షంలో పంచాయతీలో చర్చించి తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వాల్సిందిగా హెచ్చరించారు. దాంతో హుస్సేన్ ఎలాగైనా వారి కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ నేపథ్యంలో నిందితుడు హుస్సేన్, అస్గర్ అలీ సోదరిపై అత్యాచారానికి యత్నించాడు. అది కాస్తా విఫలమవడంతో ఆ మైనర్ బాలికను అత్యంత దారుణంగా హత్యచేశాడు. బాలిక శరీర భాగాలు తల, అంతర అవయవాలను ఓ పదునైన వస్తువుతో కోసినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు.
మైనర్ బాలికపై అత్యాచార యత్నం, ఆపై దారుణ హత్య
Published Wed, Oct 2 2013 10:40 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement