అప్పు తీర్చలేక.. భార్యను పణంగా పెట్టాడు! | Man offers wife to brother in exchange of money | Sakshi
Sakshi News home page

అప్పు తీర్చలేక.. భార్యను పణంగా పెట్టాడు!

Published Thu, Jul 2 2015 3:57 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man offers wife to brother in exchange of money

హర్యానాలోని  భివాండిలో దారుణం జరిగింది. అప్పు తీర్చలేని కట్టుకున్న భార్యను సొంత అన్నకు, అతని  స్నేహితునికి అప్పగించిన వైనం షాక్కు గురిచేసింది.  తన అన్న దగ్గర పాతికవేల రూపాయలను అప్పుగా తీసుకున్న సంజయ్ ఆ సొమ్మును తిరిగి చెల్లించలేక, చివరికి ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న సంజయ్ అన్న విజయ్, అతని స్నేహితుడు హర్కీష్ ఆమెకు నరకం చూపించారు. వాళ్ల అకృత్యాన్ని ప్రతిఘటించినందుకు ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, మంచానికి కట్టేసి దారుణంగా హింసించారు. అయినా లొంగకపోవడంతో తీవ్రంగా కొట్టి, మత్తు ఇంజక్షన్లు ఇచ్చి పలుమార్లు లైంగికంగా దాడి చేశారు. నెలరోజులుగా ఈ నరకం తర్వాత ఆమె  ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.  ఎలాగోలా తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో  విషయం  వెలుగుచూసింది.


తల్లిదండ్రుల సాయంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేసవి సెలవులు కావడంతో తనపిల్లలిద్దర్నీ పుట్టింట్లో వదిలి వచ్చిన తర్వాత ఈ దారుణం జరిగిందని తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి సుమన్ బాలా తెలిపారు. బాధితురాలు షాక్లో ఉందని, విచారణలో చాలాసార్లు స్పృహకోల్పోయిందన్నారు.  ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఢిల్లీలోని తులరామ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతోందని వెల్లడించారు. మరోవైపు  ఆమె పరిస్థితి మానసికంగానూ, శారీరకంగానూ  విషమంగా ఉందని  వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement