'నితీశ్ను బాంబుపెట్టి లేపేస్తా' | Man threatens to kill Nitish in bomb blast | Sakshi
Sakshi News home page

'నితీశ్ను బాంబుపెట్టి లేపేస్తా'

Published Thu, Nov 26 2015 6:10 PM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM

'నితీశ్ను బాంబుపెట్టి లేపేస్తా'

'నితీశ్ను బాంబుపెట్టి లేపేస్తా'

పట్నా: బిహార్ ఎన్నికల్లో తన సత్తా చాటి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న జేడీయూ నేత నితీశ్ కుమార్‌ను బాంబు పెట్టి హతమారుస్తానని ఓ గుర్తు తెలియని వ్యక్తి హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల వివరాల ప్రకారం పలు హిందీ వార్తా పత్రికలకు, టీవీ న్యూస్ చానెళ్లకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. త్వరలోనే భారీ స్థాయిలో బాంబులు పెట్టి జేడీయూ నేత ముఖ్యమంత్రి నితీశ్ను హత్య చేస్తానని హెచ్చరించాడు. ఈ విషయం సదరు చానెళ్లు పోలీసులకు చెప్పడంతో పోలీసులు విచారణ ప్రారంభించి ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement