న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపులకు సంబంధించి ఫైళ్ల గల్లంతు వ్యవహారంపై విపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం దిగివచ్చింది. ఈ అంశంపై ప్రధాని మన్మోహన్ సింగ్ జోక్యం చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఫైళ్ల గల్లంతు వ్యవహారంలో ప్రభుత్వానికి దాచాల్సిందేమీ లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ గురువారం లోక్‌సభలో అన్నారు. ఈ అంశంపై బొగ్గుశాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ ప్రకటన చేస్తారని, ఆయన ప్రకటనపై చర్చ జరిగినప్పుడు ప్రధాని జోక్యం చేసుకుంటారని చెప్పారు.
రాజ్యసభలో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ శుక్లా కూడా ఈ అంశంలో ప్రధాని జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అంతకు ముందు ‘బొగ్గు’ ఫైళ్ల గల్లంతుపై పార్లమెంటు ఉభయ సభలనూ విపక్షాలు హోరెత్తించాయి. ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని పట్టుబట్టాయి. గల్లంతైన ఫైళ్లు ప్రధాని బొగ్గు శాఖ బాధ్యతలను పర్యవేక్షించిన 2006-09 కాలానికి చెందినవేనని లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అన్నారు.
‘బొగ్గు’పై జోక్యం చేసుకోనున్న ప్రధాని
Published Fri, Aug 23 2013 5:06 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement