జైపూర్:అమెరికా యువతిపై దాడి, మహిళ ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం వంటి ఘటనలు పునారావృతమవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జైపూర్‌లో వెలుగు చూసింది. చక్రధర్ దాస్, షేక్ బాబు, మనాస్ మజ్హి అనే ముగ్గురు యువకులు ఓ వివాహితపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకం సృష్టించింది. గత రాత్రి ఓ వివాహిత తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి కైరో గ్రామంలో బస్సు కోసం ఎదురుచూస్తుండగా బైక్ పై వచ్చిన యువకుడు లిఫ్ట్ ఇస్తానని చెప్పి నమ్మబలికాడు. దీంతో ఆ యువకుడ్ని నమ్మి అతని బైక్ ఎక్కింది.
ఆ వివాహితను రివర్ బ్యాంక్ సమీపంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్న మరో ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. మంగళవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. గ్రామస్తులు ఆమెకు సహకరించడంతో నిందితులను గుర్తించి, కేసు నమోదు చేశామన్నారు.