
సాక్షి, చిత్తూరు: మానవత్వం మంట కలిసింది. కామాంధుని దాహానికి మరో చిన్నారి బలైంది. పుంగనూరు మండలం భగత్‌సింగ్ కాలనీలో ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు మైనర్ బాలురు 11 ఏళ్ల బాలికపై రెండు నెలల నుంచి అత్యాచారాని పాల్పడుతున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. బాలిక విషయాన్ని వాళ్ల అమ్మకు తెలియజేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరిని గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. పోలీసులు ఐదుగురు బాలురను అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.
ఘటనపై హోంమంత్రి, ఎస్పీలు స్పందిస్తూ.. బాలికతో సన్నిహితంగా ఉన్నవారే ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని ప్రకటించారు. నెలలో ఈ ఘటన ఆరవది కావడం గమనార్హం.