మోదీకి జయలలిత థ్యాంక్స్ | Metro Rail: Jaya thanks Modi for approving extension of work | Sakshi
Sakshi News home page

మోదీకి జయలలిత థ్యాంక్స్

Published Sun, Jun 5 2016 2:24 PM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

మోదీకి జయలలిత థ్యాంక్స్ - Sakshi

మోదీకి జయలలిత థ్యాంక్స్

చెన్నై : మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు అనుమతి తెలిపినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ధన్యవాదాలు తెలిపారు. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు కారిడార్-1 మొదటి ఫేజ్ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో మోదీకి థ్యాంక్స్ చెప్పారు. వాషర్మాన్పేట నుంచి తిరువొట్రియుర్/విమ్కోనగర్ వరకు 9.5 కిలోమీటర్లకు విస్తరించనున్న ఈ ప్రాజెక్టుకు రూ.3,770 కోట్లు వ్యయం అవుతుందని జయలలిత తెలిపారు.

మెట్రో రైలు విస్తరణకు ఆమోదం తెలిపాలని ప్రధాని మోదీని రెండుసార్లు కోరినట్టు గుర్తుచేశారు. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆమె లేఖ రాశారు. వేగంగా విస్తరిస్తున్న చెన్నైలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెట్రోరైలు ప్రాజెక్టు చేపట్టినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement