ఆటంకాలు తొలగించండి
సాక్షి, చెన్నై:తమిళనాడుకు విద్యుత్ సరఫరాలోని ఆటంకాల్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేం ద్ర మోడీకి సీఎం జయలలిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఓ లేఖాస్త్రం సంధించారు. తమిళనాడు వి ద్యుత్ అవసరాలు, వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర విద్యుత్ బోర్డు సూచనలతో తాము దీర్ఘ కా లిక ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపారు. 3300 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు లక్ష్యంగా ఈ ఏడాది ఒ ప్పందాలు జరిగాయని పేర్కొన్నారు. 2158 మెగావాట్ల విద్యుత్‌ను ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేసేం దుకు చర్యలు తీసుకున్నామని, పదిహేనేళ్ల పాటు తమిళనాడుకు విద్యుత్ సరఫరా అనుమతి నిమిత్తం ఆ సం స్థలు పీజీసీఎల్ అనుమతికి దరఖాస్తులు చేసుకుని ఉన్నాయని వివరించారు.
అలాగే పశ్చిమ రాష్ట్రాల నుం చి దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా లక్ష్యంగా భారీ గ్రిడ్ లైన్ల ఏర్పాటు గురించి తమరికి తెలిసిందేనని గుర్తుచేశారు. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా లక్ష్యంగా ఈలైన్ల ఏర్పాట్లు సాగుతోందన్నారు. సోలాపూర్ నుంచి రాయచ్చూర్ వరకు ఈ లైన్ల ఏర్పాటుతో దక్షిణాదికి సులభతరంగా విద్యుత్ సరఫరాకు వీలు కలగనుందన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలతో తాము కుదుర్చుకున్న ఈ ఒప్పందాలపై ప్రభావం చూపించే విధంగా కేంద్ర విద్యుత్ శాఖ బోరు చర్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు వేల మెగావాట్ల సరఫరా విద్యుత్ లైన్లలో ప్రస్తుతం 1100 మెగావాట్ల సరఫరాకు మాత్రమే అనుమతివ్వగలమని పీజీసీఐఎల్ ప్రకటించడం శోచనీయమన్నారు. ఇందు లో 750 మెగావాట్లు హైవోల్టేజీ విద్యుత్ సరఫరాకు, మిగిలిన 350 మెగావాట్లును మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా నిమిత్తం అనుమతిచ్చారని పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం వెనక్కు ఇచ్చిన 377 మెగావాట్లలో 316 మెగావాట్లను ఆంధ్ర, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు విభజించాని వివరించారు. ఆ లైన్ల ద్వారా ఈ విద్యుత్‌ను సరఫరా చేయించి, తమిళనాడు మీద ప్రభావం పడే రీతిలో కేంద్రం విద్యుత్ బోర్డు చర్యలు తీసుకుం టోందని పీఎం దృష్టికి తీసుకెళ్లే యత్నం చేశారు. దీర్ఘ కాలిక విద్యుత్ ఒప్పందాల్ని తాము ఎప్పుడో కుదుర్చుకుని ఉంటే, దానికి అనుమతివ్వకుండా, ఆ ఒప్పందాల మీద ప్రభావం చూపించే విధంగా ఆటంకాలు సృష్టించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర విద్యుత్ శాఖ చర్యలు దీర్ఘ కాలిక ఒప్పందాలను తగ్గించే రీతిలో, తమ హక్కుల్ని కాలరాసే విధంగా ఉన్నట్టు తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. తమరు జోక్యం చేసుకుని ఆటంకాలు తొలగించి, విద్యుత్ సరఫరా విషయంలో తీసుకున్న నిర్ణయాల్ని పునర్ సమీక్షించాలని, తమిళనాడుకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.