పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై ముంబై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ముంబై: పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై ముంబై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ పథకం బాధ్యతలను టీచర్లకు అప్పగించరాదంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకం బోధనేతర బాధ్యతని కోర్టు స్పష్టం చేసింది.
విద్యా చట్టం 27వ సెక్షన్ ప్రకారం ఇలాంటి బోధనేతర పనులను ఉపాధ్యాయులకు అప్పగించరాదని న్యాయస్థానం పేర్కొంది. ఎన్నికలు, విపత్తులు, జనభా లెక్కలు వంటి బాధ్యతలు మినహా ఇతర పనులు అప్పగించరాదని వ్యాఖ్యానించింది.