48గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. లేదంటే.. | MNS gives Pakistani artistes 48 hours to leave India | Sakshi
Sakshi News home page

48గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. లేదంటే..

Published Fri, Sep 23 2016 1:43 PM | Last Updated on Sat, Mar 23 2019 8:36 PM

MNS gives Pakistani artistes 48 hours to leave India

ముంబయి: పాకిస్థాన్ కు చెందిన నటులకు, టీవీ ఆర్టిస్టులకు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) హెచ్చరికలు జారీ చేసింది. 48గంటల్లో భారత దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేసింది. లేదంటే ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

ఎంఎన్ఎస్ చిత్రపత్ సేనా చీఫ్ అమేయ ఖోప్కార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల (సెప్టెంబర్ 18)న ఊడి సెక్టార్ పై పాక్ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా పాక్ వ్యతిరేక వైఖరి దేశంలో బాగా పెరిగిపోయిందని అందుకే పాక్ కు చెందిన ఏ నటులు, ఆర్టిస్లులు ఉండొద్దని ముందస్తుగా హెచ్చరిస్తున్నామని చెప్పారు.

తాము చెప్పినట్లు విని వారు వెళ్లకపోతే ఎలా పంపించాలో తమ పద్ధతిలో చూపిస్తామని హెచ్చరించారు. పాకిస్థాన్ నటులతో సినిమాలు, ప్రత్యేక షోలు చేసే నిర్మాతలను త్వరలోనే అడ్డుకుంటామని తెలిపారు. గతంలో ఎంఎన్ఎస్, శివసేన ఈ తరహా కార్యక్రమాలు గతంలో చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement