ఆ నటులతో పనిచేస్తే దెబ్బలు తప్పవు | MNS threatens to 'beat up' those who work with Pakistani actors | Sakshi

ఆ నటులతో పనిచేస్తే దెబ్బలు తప్పవు

Published Mon, Oct 10 2016 4:43 PM | Last Updated on Sat, Mar 23 2019 8:33 PM

ఆ నటులతో పనిచేస్తే దెబ్బలు తప్పవు - Sakshi

ఆ నటులతో పనిచేస్తే దెబ్బలు తప్పవు

ముంబై: పాకిస్థాన్కు చెందిన నటీనటులతో కలసి ఎవరైనా పనిచేస్తే కొడతామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) హెచ్చరించింది. పాక్ నటులు నటించిన సినిమాలు దేశంలో విడుదల కాకుండా అడ్డుకోవడంతో పాటు వారితో కలసి పనిచేసిన వారికి దెబ్బలు తప్పవని ఎంఎన్ఎస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.

పాక్ నటీనటులు 48 గంట్లలోగా దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఎంఎన్ఎస్ నాయకులు ఇటీవల అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎంఎన్ఎస్ హెచ్చరికలకు భయపడి కొంతమంది పాక్ నటులు దేశం విడిచి స్వదేశానికి వెళ్లారు. మొదట్లో ఎంఎన్ఎస్ తీరును బాలీవుడ్, రాజకీయ వర్గాలు తప్పుపట్టాయి. కాగా ఉడీ ఉగ్రదాడి, పీవోకేలో భారత సైన్యం సర్జికల్ దాడుల అనంతరం పాక్ నటులపై జాతీయ నిర్మాతల మండలి నిషేధం విధించింది. పాక్ నటులు నటించిన బాలీవుడ్ సినిమాలు త్వరలో విడుదల కావాల్సివుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement