వాటికి దూరం అంటున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
సాక్షి,న్యూఢిల్లీః ఇంటర్‌నెట్‌లో దురుసు ప్రవర్తనకు, ట్రోలింగ్‌కు తమ సంస్థ వ్యతిరేకమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా మిషన్లకు చెందిన విదేశీ ప్రతినిధులతో కూడిన సదస్సులో ఆయన మాట్లాడుతూ వివక్ష పట్ల సంఘ్ పరివార్‌కు విశ్వాసం లేదన్నారు. వివక్షకు తావు లేని అఖండ దేశం, అఖండ విశ్వాన్ని సాధించడమే తమ ఆశమయమని స్పష్టం చేశారు.
తమ సంస్థ ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి వంటి పలు రంగాల్లో 1.70 లక్షల సేవా ప్రాజెక్టులను నిర్వహిస్తున్నదని విదేశీ ప్రతినిధులకు ఆయన వివరించారు.