రూ.15000000000000
► తిరిగొచ్చిన పాతనోట్లు రూ.15 లక్షల కోట్లు
► అధికారిక లెక్కల్లో మరింత పెరిగే అవకాశం
► దశలవారీగా ఆంక్షల ఎత్తివేత: జైట్లీ
న్యూఢిల్లీ: రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్ల రూపంలో సుమారు 15 లక్షల కోట్లు డిపాజిట్లుగా ఆర్‌బీఐకి తిరిగొ చ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. రద్దయిన నోట్ల విలువ రూ.15.4 లక్షల కోట్లుగా అంచనా వేయడం తెలి సిందే. అధికారిక లెక్కలు వెలువడితే ఆర్‌బీఐకి చేరిన మొత్తంలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశ ముం ది. విదేశాల్లో ఉంటున్న వారు పాత నోట్లు మార్చుకు నేందుకు ఇంకా గడువు ఉన్నందున ఈ మొత్తం పెరిగే అవకాశముంది. జమచేసిన పాతనోట్ల వివరాలు పంపాలని డిసెంబర్ 30 గడువు ముగిసిన తరువాత ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీచేసింది. డిసెంబర్ 10న వెలువడిన ప్రకటనలో ఆర్‌బీఐ, కరెన్సీ చెస్టులకు చేరిన మొత్తం రూ.12.44 లక్షల కోట్లని పేర్కొన్నారు.
పరిశీలన తర్వాత నియంత్రణల ఎత్తివేత
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత నగదు ఉపసంహరణలపై విధించిన ఆంక్షలను ఆర్‌బీఐ ఎత్తివేస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం చెప్పారు. ఇప్పటికీ రద్దయిన పెద్ద నోట్లు కలిగిన వారు, వాటిని జమ చేయడానికి ఆర్‌బీఐ రూపొందించిన ప్రత్యేక నిబంధనలను గౌరవిస్తూ ఈ విషయంలో జోక్యం చేసుకోబోమన్నారు. ఆంక్షలు వివిధ దశల్లో విధించారు కాబట్టి ఎత్తివేత కూడా అలాగే ఉంటుందన్నారు. ప్రస్తుతం ఖాతాదారులు ఏటీఎం నుంచి రోజుకు రూ.4,500, ఏటీ ఎం, బ్యాంకుల ద్వారా వారానికి రూ. 24 వేలను కానీ విత్ డ్రా చేసుకోవచ్చు. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 మధ్య విదేశాల్లో గడిపిన భారతీయులు మార్చి 31 వరకు, ఎన్నా రైలు జూన్ 30 వరకు పాత నోట్లను మార్చుకోవచ్చు.